పెద్దతుంబళం పోలీసుస్టేషన్ ను తనిఖీ చేసిన….జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు. గురువారం జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు పెద్దతుంబళం పోలీసుస్టేషన్ ను సందర్శించారు. పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ గారు పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ…..ద్విచక్రవాహనాలను నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలన్నారు. హెల్మెట్లు ధరించి బైక్ నడుపుతున్న పోలీసులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి, సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. వినాయకచవితి పండుగ, నిమజ్జనంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ గారి వెంట ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి, ఆదోని రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి, పెద్దతుంబళం ఎస్సై పీరయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు.
[zombify_post]