in , ,

ఘనంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు

  • రాయినిగూడెంలో ఘనంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి  జన్మదిన వేడుకలు.

  • భారీ కేక్ కట్ చేసి,అన్నదానం చేసిన ఎలగబోయిన మధు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో

రాష్ట్ర మాజీ మంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మేనిఫెస్టో కమిటీ మెంబర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం రాయినిగూడెం లోని ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎలగబోయిన మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వారు బారి కేక్ కట్ చేసి మిఠాయి పంచి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎలగబోయిన మధు మాట్లాడుతూ దామన్న పుట్టుక నుండి దానగుణం కలిగి ఉన్న నాయకుడిగా 71 సంవత్సరం పూర్తి చేసుకొని 72 సంవత్సరంలో అడుగుపెడుతున్న దామోదర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సూర్యాపేట లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరుగుతుందని అన్నారు. 

రాయని గూడెం అంటే కాంగ్రెస్ పార్టీ… కాంగ్రెస్ పార్టీ అంటేనే రాయినిగూడెం అని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను ఎదగాలన్నారు. 2010లో తాను ఐకెపి సెంటర్లో బస్తాలు మోసి గుమస్తాగా పని చేశాను. పాఠశాలలో ప్రతి జెండా వందనానికి స్కూల్ విద్యార్థులకు బహుమతులు ఇస్తానని అన్నారు. తాను దామోదర్ రెడ్డి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తూ రాయినిగూడెం ప్రజల మన్ననలు పొందుతున్నానని…దామన్న తనకు ఒక గురువు అన్నారు.మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని, రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తగేళ్ల రజనీకాంత్ రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, జంగిలి సైదులు,ఎడ్ల ఉపేందర్, చందనబోయిన కిరణ్,సింగం నరేష్, సింగం మల్లేష్,దొడ్డి కిరణ్, చందనబోయిన క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభించనున్న కేసీఆర్

రాజమండ్రి నుంచి ఢిల్లీ బయలుదేరిన నారా లోకేష్