డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం :
రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ వారి ప్రత్యేక చొరవతో కోటి, ఒక లక్ష యాభై వేల రూపా యలు విలువ గలఅభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు

అతి త్వరలోనే ఈ పనులన్నింటికీ శంకుస్థాపన జరిగి నిర్మాణ పనులు ప్రారంభం చేయనున్నట్లు మంత్రి వర్యుల కార్యాలయ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
1. వాటిలో ప్రధానంగా ఉప్పలగుప్తం మండలం చినగడవెల్లి గ్రామం ఎల్ ఎస్ పేట కాలనీలో 38 లక్షల 50 వేల రూపాయలు వ్యయంతో నూతన రక్షిత మంచినీటి పథకం స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం.
2. అల్లవరం మండలం సిరగిట్లపల్లి శివారు మొగళ్ళమూరు గ్రామంలో 35 లక్షల రూపాయల వ్యయంతో నూతన రక్షిత మంచినీటి పథకం స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం.
3.అమలాపురం పట్టణం బాలురు ఉన్నత పాఠశాల నందు 10 లక్షల రూపాయల వ్యయంతో బాస్కెట్ బాల్ కోర్టు నందు ఆధునిక వసతి సదుపాయాల కల్పన నిమిత్తం పనులు ప్రారంభం.
4. అమలాపురం పట్టణం పద్మినిపేటలో అసంపూర్తిగా ఉన్న సామాజిక భవన నిర్మాణం పూర్తి చేయడానికి 8 లక్షల రూపాయల నిధులు విడుదల.
5. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం గ్రామం అయితా బత్తుల వారి పేటలో కల్వర్టు వెడల్పు చేయడానికి 4 లక్షల రూపాయలు నిధులు విడుదల.
6. అమలాపురం పట్టణంలోని జిల్లా మత్స్యకార కార్యాలయం లో సదుపాయాల కల్పన నిమిత్తం లక్ష రూపాయలు నిధులు మంజూరు.
7. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో 300 వీధిలైట్లు ఏర్పాటు చేయడానికి ఐదు లక్షల రూపాయ లు నిధులు మంజూరు. వంటివి ఉన్నాయని వారు ఆ ప్రకటనలో తెలిపారు.
[zombify_post]