కరీంనగర్ జిల్లా: స్వచ్చ సర్వేక్షన్ గ్రామీన్ 2023, రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక కార్యక్రమం పల్లె ప్రగతి స్ఫూర్తితో గ్రామాలలో పారిశుధ్యం మెరుగు పరుచుకొని గ్రామంలోని – బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిషేదించి తడి పొడి చెత్త లను సక్రమంగా నిర్వహిస్తూ తడి చెత్తను ఎరువుగా మార్చడం , పొడి చెత్తతో ఆదాయం సమకూర్చుకోవడం, మురికి నీటి సక్రమ నిర్వహణలో భాగంగా వ్యక్తిగత ఇంకుడుగుంతల నిర్మాణం, కిచెన్ గార్డెన్ ల ఏర్పాటు, మరియు కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి గ్రామంలో ఎక్కడ చెత్త చెదారం, మురికి నిటి నిల్వలు లేకుండా గ్రామ ప్రజలందరు ఆరోగ్యంగా జీవించేలా చర్యలు చేపట్టి జిల్లాలో ఉన్నత ప్రతిభ కనబరిచిన *గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామాన్ని 2000 లోపు జనాభా ప్రతిపదికనలో రెండవ స్థానంలో* గుర్తించి మరియు *రామడుగు మండలం వెలిచాల గ్రామాన్ని 5000 పైగా జనాభా ప్రాతిపదికన 5 వ స్థానంలో గుర్తించి,* తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ కేంద్రం, హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గౌరవ పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ. ఎర్రబెల్లి దయాకరరావు గారు వారి చేతులమీదుగా కరీంనగర్ జిల్లా *ఖాసింపేట మరియు వెలిచాల* గ్రామాలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీమతి వీర్ల సరోజన, సర్పంచ్, వెలిచాల , శ్రీమతి గంప మల్లీశ్వరి, సర్పంచ్, ఖాసీంపేట, మరియు పంచాయతీ కార్యదర్శులు అనిల్, ఆనంద్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పి.ఆర్.&ఆర్.డి., కమిషనర్, పి.ఆర్.&ఆర్.డి., సి.ఈ.ఓ. సెర్ప్, స్పెషల్ కమిషనర్, మరియు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు. కరీంనగర్ జిల్లా నుండి ఎల్.శ్రీలత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, టి.పవనకుమార్, ముఖ్య కార్య నిర్వహణ అధికారి, వీర బుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి, రామడుగు ఎం.పి.డి.ఓ భాస్కర్ రావు, గన్నేరువరం ఎంపీడీఓ స్వాతి, మండల పంచాయతీ అధికారులు రాజశేఖర్ రెడ్డి, నర్సింహారెడ్డి, స్వచ్ఛ భారత్ జిల్లా కన్సల్టెంట్లు రమేష్, వేణు పాల్గొన్నారు
[zombify_post]