ధ్వంసమైన చందాపురం వాగు రోడ్డు, బారికాడ్స్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ :
నందిగామ మండలంలో విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల్లోని రోడ్లు ధ్వంసమయ్యాయి. చందాపురం సమీపంలోని వాగు వరద నీరు ప్రధాన రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో కోతకు గురై ప్రమాదకరంగా మారింది. కొంత మేర రోడ్డు కోతకు గురై భారీ గొయ్యి ఏర్పడింది.
నందిగామ నుండి చందాపురం మీదుగా చందర్లపాడు మండలం చుట్టుపక్కల గ్రామస్తులు ఎక్కువగా వాహనదారులు వస్తూపోతుంటారు కాబట్టి రాత్రిపూట గొయ్యిలో పడే ప్రమాదం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ దృష్టికి తీసుకురాగా ప్రమాదాన్ని నివారించుటకు ప్రస్తుతానికి బారికెట్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు రిపేరు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
[zombify_post]