డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
పేదలందరి ఆరోగ్య భద్రతకై అండగా నిలిచి ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులు తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ 26 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించి జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరు విధి విధానాలను వివరించారు. ఈ వీడియో కాన్ఫరె న్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పౌరులలో ఆరోగ్యపరమైన అవగాహన కల్పించి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని ఆరోగ్య సేవలు అందిం చడమే లక్ష్యంగా రూపొందించబ డిందని తెలిపారు. మొదటి దశలో వాలంటీర్లు గృహసారథులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవల వివరాలపై అవ గాహన కల్పించాలని,ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల జాబితాతో కూడిన వివరాలు అందించి ఆయా వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొం దించాలన్నారు. ప్రతి ఇంటిలో ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి, స్థానిక ఏఎన్‌ఎం లకు తెలియజేయాలన్నారు. రెండవ దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి షుగర్, బీపీ, రక్త పరీక్షలు ఆ యొక్క వివరాలను సిటిజన్ మొబైల్ యాప్ లో నమోదు చేయాలన్నారు . శిబిరాల నిర్వహణ సమయానికి వారి హెల్త్ రిపోర్ట్ సిద్ధం చేస్తారని. ఈ నెల 8న ఉచిత శిబిరాల నిర్వహణ తేదీల ను ఎంపీడీవోలు విడుదల చేశారన్నారు. ప్రజల ఆరోగ్య సమ స్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమ న్నారు.ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించాల న్నారు. ఆరోగ్యశ్రీ కరపత్రాలను పంపిణీ చేసి. ఆయా వైద్య సేవలను వివరించి అవగాహన పెంపొందించాలన్నారు ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూని టీ హెల్త్ అధికారులు సందర్శించాల న్నారు ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలను గుర్తించాలన్నారు. ఆ వివరాలను డాక్టర్లకు అందుబాటు లో ఉంచాలన్నారు ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూ నిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు జారీ చేయాలన్నారు. మూడవ దశలో వైద్య శిబిరాలు నిర్వహణకు మూడు రోజులు ముందుగా ప్రజాప్రతినిధులు గృహ సారధులు వాలంటీర్లు మూడు రోజులలో మీ గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ముందుగా తెలియజేయాలన్నారు. నాలుగో దశలో ఈనెల 30 నుంచి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలోని 432 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 7 అర్బన్ ఆరోగ్య కేంద్రా లలో ఈనెల 30 నుండి అక్టోబర్ 31 వరకు 56 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఆధీనంలో ఏర్పాటు చేయనుందన్నారు. ప్రతిరోజూ ప్రతి మండలం లోనూ ఏదో ఒక వైఎస్సా ర్ విలేజ్ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్ట ణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాలను నిర్వహించాల న్నారు.నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహించాలని,ఈ వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్య సేవలు అందించాలని. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్ సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొనాలన్నారు.. వివిధ రకాల మందులతో పాటు 18 రకాల శస్త్ర చికిత్సలు, అందుబాటులో ఉంచాలని. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరిశీలించి చికిత్సలు చేయడంతోపాటు అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి. ఉచితం గా మందులు పంపిణీ చేయాలన్నా రు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అమలులో ఆయా శాఖల మధ్య పూర్తి సమన్వయం అవసర మన్నారు. ఇంటింటి సర్వే నిర్వ హణ సమయంలో సాధారణ వాటితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువులేని పిల్లలు, క్షయ, కుష్ఠు వ్యాధులు కలిగిన వారు ఉంటే. ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారు లను ఆదేశించారు. అలాగే రక్తహీనత ఉన్న మహిళలు మరియు కౌమారదశలో బాలిక లను వైద్య పరీక్షల నిమిత్తం శిబిరా లకు తీసుకురావాలన్నారు. ఈ వైద్య శిబిరాలలో కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించి కళ్ళ అద్దాలు ఉచితంగా అందించాలన్నారు క్యాంపుల అనంతరం ప్రతి మండలంలో నెలకు నాలుగు గ్రామాలలో నాలుగు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలను ఫాలో అప్ చేయాలన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాలను ఎంపీడీవో తాసిల్దా రులు పర్యవేక్షక బాధ్యతలు చేపడతారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పద్మశ్రీ రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం దుర్గారావు దొర, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం కమల కుమారి అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ భరత్ లక్ష్మి, ఫ్యామిలీ డాక్టర్ ఫిజీషియన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సుమలత, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ఆoడ్రోస్, జిల్లా పంచా యతీ అధికారి వి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]