రాబోయే ఎన్నికల నిబంధనలపై పలు రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించిన సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ్ రెడ్డి …రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం రోజున సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల అన్ని రాజకీయ నాయకుల తో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డిఎస్పి ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని నిబంధనలు అతిక్రమిస్తే ఏ పార్టీ వారైనా చట్టం దృష్టిలో సమానమే అని అన్నారు . మతాలను ,కులాలను,జాతులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని , ఎన్నికల నియమ నియమావళి ప్రకారం చట్టానికి లోబడి ప్రచారాలు చేసుకోవాలని సూచించారు. పోలీసుల పర్మిషన్ లేకుండా ఎలాంటి ర్యాలీలు సభలు నిర్వహించరాదని తెలియజేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ శశిధర్ రెడ్డి ,ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ,రమాకాంత్ ,గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ ,వీర్నపల్లి ఎస్ ఐ నవత ,తహసీల్దారులు తదితర అధికారులు రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
[zombify_post]