in

జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రదాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక డీఎస్పీ మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతాదళాలపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ కర్నల్‌, మేజర్‌తోపాటు, జమ్మూ పోలీస్‌కు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు..

అనంత్‌నాగ్‌ జిల్లాలోని కోకర్‌నాగ్‌ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు ఈ భీకర దాడులకు తెగబడ్డారు.

అనంత్‌నాగ్‌ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వారిని పట్టుకునేందుకు మంగళవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. బుధవారం ఉదయం వరకు ఆపరేషన్‌ చేపట్టాయి. ఆ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రమూకలు దాడులకు తెగబడటంతో పోలీసులు కూడా ఎదురుదాడి జరిపారు..

కమాండింగ్‌ ఆఫీసర్‌, డీఎస్పీ నేతృత్వంలో భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌కు (19ఆర్‌ఆర్‌) చెందిన కమాండింగ్‌ అధికారి మన్‌ప్రీత్‌ సింగ్‌, ఆర్మీ మేజర్‌ మనోజ్‌ ఆశీష్‌ ఢోన్‌చక్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి హుమన్యూన్‌ ముజాహిల్‌ భట్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని రక్షించేందుకు అదనపు బలగాలు ప్రయత్నించినప్పటికీ.. ఉగ్రవాదులు నుంచి తీవ్ర స్థాయిలో కాల్పులు కొనసాగడంతో వారిని తరలించడం సాధ్యం కాలేదు. దీంతో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు జమ్మూ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలిపారు..

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

అక్టోబర్ 30 లోపల మరో అరెస్ట్ ఉంటుంది.. ఉండవల్లి అరుణ్‌ కుమార్ సెన్సేషనల్

అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ కు ఆత్మీయ వీడ్కోలు*