ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడప్పుడు బాంబు పేల్చే మాటలు మాట్లాడుతుంటారు. ఆయన ఎంతో లోతైన అర్థం ఉంటే తప్ప ఎలాంటి కామెంట్స్ చేయరు
పైగా ఆయనకు తెలియని వాటి గురించి అస్సలు మాట్లాడరు. కాబట్టి ఆయన ఏదైనా చెబితే దాని గురించి కచ్చితంగా ఆయనకు ఎంతో కొంత సమాచారం ఉంటుందనే అభిప్రాయలు ఉంటాయి.
కాగా తాజాగా ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా వాడీ వేడీ రాజకీయాలు నడుస్తున్నాయి. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే అక్టోబర్ 30లోపల ఇంతకు మించి ఇంకో అరెస్ట్ ఉంటుందని ఉండవల్లి బాంబు పేల్చారు.

ఇప్పటికే ఈ కేసులో లోకేష్ కు కూడాసంబంధం ఉందని.. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అటు అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ అవుతారనే ఆరోపణలు ఉన్నాయి. మొన్న సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. లోకేష్ ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మొత్తానికి నారా కుటుంబంలో అటు చంద్రబాబు ఇటు చినబాబు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని బహుశాఎవరూ ఊహించలేదేమో. మరి ఇందులో ముందు ముందు ఇంకెవరు అరెస్ట్ అవుతారో వేచి చూడాలి.
[zombify_post]