తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి ఆదర్శం 4500మంది కమ్యూనిస్టుల రక్త తర్పణంతో పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐ, పార్టీది చరిత్రని వక్రీకరించాలని చూస్తున్న బిజెపి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ భూమి కోసం భుక్తికోసం అనగారిని వర్గాల విముక్తి కోసం దున్నేవాడికి భూమి కావాలని నినదించి పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ అన్నారు. సాయుధ పోరాటం వారోత్సవాల్లో భాగంగా సత్తుపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహిద్దిన్ ల నాయకత్వంలో సామాన్య ప్రజలను సాయుదులుగా మార్చి నైజాం నవాబు గోరిగట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ది అని, 4500మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని ఎంతో చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని చరిత్ర లేని బిజెపి పార్టీ ఇది హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడుతున్నారని తెలంగాణలో బిజెపికి గోరి కట్టడం ఖాయమని హెచ్చరించారు. ప్రపంచానికే ఆదర్శమైన తెలంగాణ సాయుధ పోరాటం మట్టి మనుషులను మహోన్నతలుగా తయారుచేసి దొడ్డి కొమరయ్య సాకల ఐలమ్మ బంధకి ఇలాంటి ఎందరో విప్లవ పోరాట శక్తులను తయారు చేసిందన్నారు. ముమ్మాటికి ఇది కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్వహించిన విరోచత పోరాటమని ఈ చరిత్ర కమ్యూనిస్టు పార్టీ కె దక్కుతుందని ఆనాటి సాయుధ పోరాడు స్ఫూర్తితో రానున్న కాలంలో పేదలకు భూమికోసం ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ టౌన్ కార్యదర్శి రామకృష్ణ, కృష్ణ, రాంబాబు, పుల్లయ్య, వెంకటేశ్వరరావు, శ్యామల కుమారి, దయమని, వెంకటమ్మ, లక్ష్మి, ప్రసాదు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]