*వర్షభవం పరిస్థితులు వల్ల తీవ్రమైన కరవు ఏర్పడ్డాయని కావున తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించి కరవు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
* నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30000 నుండి 50 వేల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ఆదోని న్యూస్ :- ఆదోనిలో మార్కెట్ కమిటీ రోడ్డు సుందరయ్య భవన్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని కౌతలం మండల కమిటీల అధ్వర్యంలో ఉమ్మడి సమావేశం జరిగింది. కౌతలం మండల కార్యదర్శి ఈరన్న అధ్యక్షత వహించారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు ఉపాధ్యక్షుడు మల్లయ్యలు మాట్లాడారు…… ఆదోని డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో వర్షభవం వల్ల తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని కావున తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించి కరవు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏకరాకు ముప్పై వేల నుండి యాబై వేలు రూపాయిల వరకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వంలను కోరారు. అలాగే రైతు కౌలు రైతు కూలీలు రుణాలు మాఫీ చేయాలని కోరారు. దేవాలయ వక్ఫ్ భూములు కౌలు రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రాలు సచివాలయం కార్యదర్శి గారికి అలాగె తహశీల్దార్ గారికి సమర్పింవలెను అని అన్నారు. కరవు శాస్వత నివారణ కోసం తుంగభద్ర నది నుంచి మెలిగానుర్ వరద నీరు కాలువ నిర్మించాలి అని అన్నారు. అక్టోబర్ మొదటి వారంలో మెలిగనుర్ వరద కాలువ నిర్మాణం కోసం పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు. కౌతలం మండలం మెలిగణుర్ నుండి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరుగు పాదయాత్రలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

[zombify_post]