*నిర్మల్ లో దొంగ ఓట్ల నమోదుపై ఢిల్లీ లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి…*
నిర్మల్ లో దొంగ ఓట్లతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గెలుస్తున్నాడని బీజేపి నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ క్యాంప్ కార్యాలయం లో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల హామీలను తుంగలో తొక్కి
ఎన్నికలు వచ్చిన ప్రతి సారి భూటకపు హామీలతో ప్రజలను మభ్య పెడుతూ, దొంగ ఓట్లతో గెలుస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య బద్ధంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక దొంగ సారాతో, అవినీతి సొమ్ముతో గెలుస్తూ వచ్చారని, ఇక ఈ అవినీతి మంత్రి నీ ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు గనక వేలాది గా ఒక వర్గానికి చెందిన దొంగ ఓట్లను నమోదు చేయించి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి నిర్మల్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు
.నిర్మల్ లో మొత్తం గా 32000 దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఢిల్లీ లోని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను రాష్ట్ర నాయకత్వం తో రేపు ఢిల్లీ లో కలవ నున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ దొంగ ఓట్ల అంశం పై నేడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.
* ఓకే ఇంటి నంబర్ పై 10 ఓట్లకు పైగా 1553 ఇండ్లలో. 21906 ఓట్లు నమోదయ్యాయి,
* ఇంటి నంబర్ లేకుండా ప్రశ్నార్థకం గుర్తుతో ? ఇంటి నంబర్ 0- 0 తో 670 ఓట్లకు పైగా ఉన్నాయని తెలిపారు.
* ఓకే ఇంట్లో 20 నుండి 100 కు పై గా ఓట్లు ఉన్న 4240 ఓట్లు నమొదుకాగా
*నిర్మల్ పట్టణం లో హౌజ్ నంబర్స్ 19500 ఉంటే ప్రస్తుతం 25000 హౌజ్ నంబర్స్ లో దాదాపుగా 5000 హౌజ్ నంబర్స్ బోగస్ అని తెలిసింది.
దొంగ సార, దొంగ కలప వ్యాపారం చేసే మంత్రి దొంగ ఓట్ల ను కూడా నమోదు చేయించడం సిగ్గు చేటు.
భారతీయ జనతా పార్టీ నీ ఓడగొట్టడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిల్లర పనులు చేస్తున్నారు, ఓట్లను చీల్చడం కోసం తన అనుచరులను కాంగ్రెస్ పార్టీ లోకి పంపారు.
ప్రజలను మోసం చేసిన పార్టీ BRS ను ప్రజలు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారు.నిర్మల్ పట్టణం లో మంత్రి, మంత్రి బంధువులు చేసిన భూ కబ్జాల వల్ల చిన్న పాటి వర్షానికే నిర్మల్ పట్టణం నీట మునిగే పరిస్థితి నెలకొంది, మంత్రి ఇంటి ముందు సైతం రోడ్లు చెరువును తలపించడం మంత్రి అసమర్థ పాలన కు నిదర్శనం, నిర్మల్ లో భూములు, చెరువులు అన్ని కబ్జా చేసేశారు ఇక మంత్రి మంత్రి బంధువులు గుట్టల పై కన్ను పడిందని ఎక్కడికక్కడ గుట్టలను కబ్జా చేస్తున్నారని మండి పడ్డారు. నిర్మల్ రైల్వే లైన్ కు రాష్ట్ర నిధులు కేటాయించ కుండా పెండింగ్ లో ఉంచారని రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేని నరేంద్ర మోడీ గారు వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మల్ కు రైల్వే లైన్ మంజూరు చేస్తే దానిలో మంత్రి కృషి ఉంధి అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.
మధ్యాహ్నం 3 గం.లకు ఢిల్లీ లో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను కలిసి ..అలాగే మాస్టర్ ప్లాన్ రద్దు పై నిర్మల్ లో జరిగిన లాఠీ ఛార్జ్ ఘటన పై సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ,
బీసీ కమిషన్, SC ST కమీషన్ ను ఆశ్రయించి లాఠీ ఛార్జ్ చేసిన పోలీసు అధికారులపై ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు .
ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, సాదం అరవింద్, భూపాల్ రెడ్డి, భూపతి రెడ్డి, సరికెల గంగన్న, మార గంగారెడ్డి, నారాయణ్ రెడ్డి, జమాల్, గోవర్ధన్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]