in

నయా నిజాం పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ ను తరిమి కొట్టాలి_ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి

*నయా నిజాం పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ ను తరిమి కొట్టాలి_ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.*

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా క్యాంప్ కార్యాలయం లో జాతీయ జెండా ఎగురవేసి, నిర్మల్ జిల్లా కేంద్రం లోని వెయ్యి ఉరుల మర్రి వద్ద అమర వీరులకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ పాలన నయా నిజాం పాలన ను తలపిస్తోందని అన్నారు.1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.
కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది.
ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది.
ఒకవైపు దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు..
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు.
భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయం తో,
సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన తో  హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణ రాష్టం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్న ప్రజలకు, స్వ రాష్ట్రం  లో కూడాబతుకులు మారలేదు.
నయా నిజాం మాదిరిగా కెసిఆర్ పాలన కొనసాగుతుంది , పోలీసులను అడ్డుపెట్టుకొని దొరల పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ సర్కార్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, కెసిఆర్ అన్న మాటలు ఒక సారి గుర్తుకు చేసుకోవాలి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని నాడు భూటకపు మాటలు మాట్లాడిన కెసిఆర్ ,
నేడు స్వరాష్ట్రం సాధించాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా    నిర్వహించడం లేదో చెప్పాలి
ఎంఐఎం, కాంగ్రెస్  పార్టీ లకు బయపడి ఈ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదా…
రాజకీయ లబ్ది కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్న కెసిఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
రానున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Srikanth

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

మహిళా ఆరోగ్య భద్రతకే ఋతుప్రేమ..! మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ఆసియా కప్- భారత్..ఘనవిజయం