in , ,

విజయనగరం జిల్లాలో విషాదం..బావిలో దూకి తండ్రి, తల్లి, కుమార్తె ఆత్మహత్య

విజయనగరం జిల్లా శృంగవరపుకోట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నూతిలో పడి కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం అర్థ రాత్రి జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది..

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొత్తవలస మండలం,చింతలపాలెం గ్రామ పొలాల సమీపంలో నూతిలో పడి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ సంఘటనలో తండ్రి, తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నది విశాఖపట్నం జిల్లా, మర్రిపాలెం గ్రామ FCI Nagar ప్రాంతానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతులు భర్త ఎం.డి మహినుద్దీన్ 46 సం,,భార్య సంసు 39 సం,, కుమార్తె బహిర 17 సంవత్సరాలు ఉన్నారని గుర్తించారు పోలీసులు. క్యాబ్ లో వచ్చి కుమారునికి ఆలీ 19 సం,, ఫోన్ చేసి మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని లొకేషన్ పెట్టి సూసైడ్ నోట్ పెట్టి చనిపోయిన ట్టు సమాచారం అందుతోంది. కొత్త వలస సి.ఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఖమ్మం సన్నహక సమావేశంలో మానవతారాయ