భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు..
మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇల్లందు – టేకులపల్లి ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను టేకులపల్లి మండలం రోల్లపాడుకు చెందిన సంతోష్, నాగరాజు, లచ్చతండాకు చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారనే విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్… ఆస్పత్రికి వద్దకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూసి ఆమె కూడా కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. యువకులు మద్యం మత్తులో బైక్ నడిపారా లేక.. నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు..
[zombify_post]