రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను దారుణమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు..
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్దకు వచ్చి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు.
'' ఈ వయసులో చంద్రబాబును జైలుకు పంపడం.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని హింసించి వేధించడం బాధిస్తోంది. మానసిక రోగి సంతృప్తి కోసం వ్యవస్థలు ఎలా పనిచేశాయన్నది ఈ వ్యవహారం స్పష్టం చేసింది. అధికారులు ఇలా వ్యవహరించడం దారుణం'' అని హర్షకుమార్ అన్నారు..
[zombify_post]