శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో పవిత్ర శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా చివరి సోమవారం పురస్కరించుకొని ఉరుకుంద క్షేత్రం నుండి కందుకూరు వరకు స్వామివారి ఉత్సవమూర్తిని రమణీయంగా సాగిన మహాపల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి, తుంగభద్ర నదిజలాలతో శాస్త్రోక్తంగా పుణ్యస్నానంను జరిపించారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు గ్రామం తుంగభద్రనది తీరాన జరుగుతున్న ఈ పల్లకి మహాత్సవ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా వైయస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకులు వై ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రదీప్ రెడ్డి కి ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం బోర్డు అధ్యక్షులు నాగరాజు గౌడ్, ఆలయ అర్చకులు వీరప్ప స్వామి, మండల కన్వీనర్ బెట్టనగౌడ్ స్వాగతం పలికారు. మహాపల్లకిలో ఉన్న ఉరుకుంద ఈరన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజు, జగదీష్ స్వామి, దొడ్డి నర్సన్న, నరసింహులు గౌడ్, కాల్వ లక్ష్మయ్య, వీరస్వామి, కందుకూరు తాయన్న, యంపీటీసి మల్లయ్య,bమాజీ యంపీటీసి రమేష్, పి.వెంకటేష్, పెద్ద బొంపల్లిఅంజి, దేవస్థానం బోర్డు సభ్యులు మల్లికార్జున గౌడ్, వీజేంద్ర రెడ్డి, బుళ్ళి నరసింహులు, వై.నర్సమ్మ, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]