-
ఏ తల్లి కన్నా బిడ్డో…
-
పాపం చెట్ల పొదల్లో అరుపులు, కేకలు..
-
108కి సమాచారం ఇచ్చిన బహిర్భూమికి వెళ్ళినవారు..
-
క్షేమంగా సూర్యాపేట మాత శిశు కేంద్రానికి అప్పగించిన 108సిబ్బంది రమేష్,చిరంజీవి….
-
ఆడపిల్లలు బతికే రోజులు లేవా?
-
ఆడపిల్లను వదిలించుకోవాలనుకున్న తల్లి ఎవరు?.
సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న ఇంకా ఆడపిల్లలను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఆడపిల్లలు లేకుంటే సమాజంలో మగవారు ఉంటారా. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్ల పొదల్లో వదిలివేసిన తల్లికి పలువురు శాపనార్థాలు పెడుతున్నారు.
108 సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం….
నెమ్మికల్ గ్రామ చెట్ల పొదలలో అర్ధరాత్రి వేళ అప్పుడే ఆడ శిశువు ను కన్న తల్లి వదిలి వేసినట్లు తెలుస్తుంది. సోమవారం తెల్లవారుజామున బహిర్బుమికి వెళ్లిన వారు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది రమేష్ చిరంజీవి వెళ్లి పాపను ప్రథమ చికిత్స చేస్తూ సూర్యాపేట మాత శిశు ఆస్పటల్ సిబ్బందికి అప్పగించారు. పాప క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నట్లువారు తెలిపారు.
[zombify_post]