in ,

గడప గడపకు మన ప్రభుత్వం

న్యూస్ టుడే , విశాఖపట్నం, భీమిలి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన శ్రీ అవంతి శ్రీనివాస్ గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, ఎల్లవానిపాలెంలో (9క్లస్టర్ లు )556 ఇళ్లలో గడప గడప కి వెళ్లి నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పర్యటించటం జరిగింది. మొదటిరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కు విచ్చేసిన అవంతి గారికి నాయకులు అశేష ప్రజానికం అడుగడుగునా స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ గారు, మాట్లాడుతూ. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ నిష్పక్షపాతంగా అందుతున్నాయ, లేదా అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వినతి రూపంలో తీసుకుని వాటిని ఈ కార్యక్రమం ద్వార  పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సంతోష్ నగర్ గణేష్ నగర్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆయన అడగగా, కొన్ని సమస్యలు ,ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రజకుల ల సామాజి భవనం పాడైందని, దాన్ని మరమ్మతు చేయించాలని,  డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తు చేయించాలని, సీసీ రోడ్లు నిర్మించాలని ఆయన దృష్టికి తేవడం జరిగింది. ఈ సమస్యలని త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ వైసీపీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది, ప్రభుత్వం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Balakishan

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

సాయంత్రం చెక్కులు అందించనున్న ఎమ్మెల్యే సండ్ర

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు