దేశంలో ఉన్నత దర్యాప్తు సంస్థల్లో కీలకమైన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఎస్ఐఏ) శనివారం చర్ల మండలంలో సోదాలు నిర్వహించడం సర్వత్రా సంచలనమైంది.ఎన్ఐఏ బృందం కీలకమైన సమాచారం కోసం కొత్తగూడెం, భద్రాచలం, పర్ణశాల మీదుగా చర్ల మండలంలోని చర్ల,ఉంజుపల్లి, చెన్నాపురం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అనంతరం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పామేడు గ్రామంకు చేరుకొని అక్కడ సైతం సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమాచారంసేకరించినట్లు వినికిడి. ఇటీవల కాలంలో చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వారు డ్రోన్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు డ్రోన్లు ఎవరి కోసం కొనుగోలు చేశారు?. వారి వ్యాపార
నిమిత్తమా లేదా ఇతరత్రా అవసరాల కోసమా అనే దానిపై తమదైన శైలిలో విచారించినట్లు ప్రచారం సాగుతోంది. భద్రాద్రి ఏజెన్సీలో ఎన్ఐఏ బృందం తనిఖీలు నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవానికి
ఎన్ఎస్ఐ ఎవరి కోసం వచ్చింది? ఏ లక్ష్యం కోసం చర్ల మండలం పామేడులో తనిఖీలు నిర్వహించింది అనేదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.ఎన్ఐస్ఐఏ కేవలం డ్రోన్ల
కొనుగోలు విషయంలో సమాచార సేకరణకు మారమూల ఏజెన్సీ గ్రామాలకు వస్తుందా అనే అనుమానం సైతం వ్యక్తమవుతోంది. ఏదైనా విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో
క్షేత్రస్థాయిలో నిర్ధారణ కోసం భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలోసోదాలు నిర్వహించిందా?, లేదా మరేదైనా కీలక సమాచార సేకరణ కోసం రావడం జరిగిందా అనే దానిపైస్పష్టత రావడం లేదు. ఈ విషయంపై భద్రాచలం ఎఎస్పీ పరితోష్ పంకజ్ ఎస్ఐఏ బృందం రాక సాధారణమేనని పేర్కొన్నారు.చర్ల మండలంలోని ఓ గ్రామంలో డ్రోన్ కొనుగోలు కేసుకు సంబంధించిన వివరాల కోసంమాత్రమే వచ్చినట్లు పేర్కొన్నారు.
[zombify_post]