పోర్టు నిర్వాసితుల మహాధర్నా జయప్రదం చేయండి
సంతబొమ్మాలి మండలం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్వాసితుల సమస్యలపై ఈనెల 11వ తేదీన మూలపేట గ్రామంలో చేపట్టనున్న అఖిలపక్ష పార్టీల ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు చాపర వెంకటరమణ కోరారు. గత నెల 25 న అఖిలపక్ష సమావేశం తీర్మానం చేసిన మేరకు నిర్వసితుల కోసం ఈ ధర్నా చేస్తున్నామన్నారు. పోర్టు నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసమే ఈ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు
[zombify_post]
