ఎన్టీఆర్ జిల్లా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట దగ్గర్లో గరికపాడు చెక్పోస్ట్ వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. తప్పించుకొని అనుమంచిపల్లెకి వద్దకు రాగానే జాతీయ రహదారిపై మళ్ళీ అడ్డుకున్న పోలీసులు. పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలిసి గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు. పోలీసుల చర్యలతో విసుగు చెందిన పవన్ కళ్యాణ్ కారు దిగి రహదారిపై నడుస్తూ మంగళగిరి జనసేన కార్యాలయం వెళ్తానని రహదారి మార్గంలో జాతీయ రహదారిపై నడుస్తున్న పవన్ కళ్యాణ్. పోలీసులు ఏదో ఒక విధంగా ఎస్పి కాంతిరాన్ టాటా వచ్చేవరకు పవన్ కళ్యాణ్ ను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పరిస్థితి ఉధృతంగా మారింది నందిగామ జగ్గయ్యపేట పోలీసులు పవన్ కళ్యాణ్ ను ఆపేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
[zombify_post]