టీడీపీ నేతలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ లభించలేదు. మొదట ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఎమ్మెల్యేలు గణబాబు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రామారావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాస్లు గవర్నర్ను కలిసి చంద్రబాబు అరెస్టు గురించి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. అయితే చివరి నిమిషంలో టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసే కార్యక్రమం ఆదివారం ఉదయం 9.30 గంటలకు వాయిదా పడినట్లు సమాచారం. రేపు ఎఫ్ఐఆర్లో పేరులేని వ్యక్తిని అరెస్టు చేశారని టీడీపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కొనసాగుతున్న చంద్రబాబు విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పోలీసులు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అధికారులు పేవర్ వర్క్ పనిని పూర్తి చేస్తున్నారు. అక్కడ చంద్రబాబును సుమారు గంటన్నర పాటు విచారించే అవకాశం ఉంది. చంద్రబాబు స్టేట్ మెంట్ను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబును వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లనున్నారు. వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు.
సిట్ కార్యాలయంలోకి చంద్రబాబు కుటుంబ సభ్యులు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులను SIT కార్యాలయంలోకి అనుమతించారు. సీఐడీ అధికారులు చంద్రబాబును చూసేందుకు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, మరికొందరు కుటుంబసభ్యులను సిట్ ఆఫీసులోకి పంపించారు. నేటి ఉదయం నుంచి చంద్రబాబును కలిసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేతను కలిసేందుకు చంద్రబాబు కుటుంబసభ్యులను సిట్ కార్యాలయంలోకి అధికారులు అనుతించారు.
[zombify_post]