in , ,

సత్తుపల్లి ని జిల్లాగా ప్రకటించాలి

సత్తుపల్లి జిల్లా సాధన విద్యార్థి జేఏసీ

సత్తుపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సత్తుపల్లి జిల్లా సాధన విద్యార్థి జెఎసి కన్వీనర్ జొన్నగట్ల రాజు ఆధ్వర్యంలో సత్తుపల్లి జిల్లాగా ప్రకటించాలని సత్తుపల్లి విద్యాసంస్థల విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వేడుకున్నారు. సత్తుపల్లి కంటే చిన్న ప్రాంతాల్లో కూడా జిల్లాగా ప్రకటించి సత్తుపల్లి ప్రాంతంకి తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. అశ్వరావుపేట, సత్తుపల్లి కలిపి సత్తుపల్లి జిల్లాగా ప్రకటించాలని విద్యార్థులు కోరినారు. సత్తుపల్లి జిల్లాగా ప్రకటించాలి, లేనిపక్షంలో సత్తుపల్లి విద్యార్థి జేఏసీ తరఫున సత్తుపల్లి జిల్లా సాధన ఉద్యమాన్ని ఉద్రితం చేస్తామని, సత్తుపల్లిలో ప్రతి కళాశాలలో సత్తుపల్లి జిల్లా సాధన కమిటీ వేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని తెలిపినారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి జిల్లా సాధన విద్యార్థి నాయకులు అబిద్, ఇనపనూరి రాధాకృష్ణ , ఇమ్రాన్, ప్రిన్స్, ప్రసన్న, రెడ్డి తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

బొబ్బిలిలో తీవ్ర ఉద్రిక్తత…

బొబ్బిలి రైల్వే స్టేషన్ పరిధిలో..వ్యక్తి మృతి