తన అరెస్టుపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు.
తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. "ప్రజా సమస్యలపై పోరాడుతుంటేఅణిచివేస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు.నేనేం తప్పు చేశాను? ఆధారాలేవీ అని అడిగా. ఎందుకు అరెస్టు చేస్తున్నారో*చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారు.
*ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నా. తెలుగువారి ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. తెలుగు ప్రజలు, మాతృభూమికి సేవ చేయకుండా తనను ఏ శక్తీ ఆపలేదు." అని చంద్రబాబు తెలిపారు. తెదేపా శ్రేణులను రాష్ట్రవ్యాప్తంగా అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
[zombify_post]