in

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఎలా వెలుగులోకి వచ్చింది.? బాబు పాత్ర ఏంటీ.?

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారిన విషయం తెలిసిందే.

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అసలు ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ ఎలా వెలుగులోకి వచ్చింది.?

ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి.?

పోలీసులు వాదన ఏంటి.?

లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

2019లో పుణెలో జీఎస్టీ దాడులతో తొలిసారి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది డిజైన్‌టెక్‌ కంపెనీ మీద జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సమయంలో షెల్ కంపెనీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.241కోట్లతో సాఫ్ట్‌వేర్‌ను ఏపీ సర్కార్‌కు ఇచ్చినట్లు సీమెన్స్‌ కంపెనీ వెల్లడించింది. రూ.241 కోట్లు వివిధ కంపెనీలకు సీమెన్స్‌ కంపెనీ ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు తేలింది. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ ప్రసాద్‌తోపాటు మరికొంత మంది ప్రైవేట్‌ వ్యక్తుల కంపెనీలకు అమౌంట్‌ బదిలీ అయ్యింది.

అలాగే డిజైన్‌టెక్‌, ఇన్‌వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా సీమెన్స్‌కి మనీ ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. గంటా సుబ్బారావుకు చెందిన ప్రతీక్‌ ఇన్‌ఫో సర్వీసెస్‌, లక్ష్మీనారాయణకు చెందిన ఐటీ సొల్యూషన్స్‌కు నిధుల మళ్లింపు జరిగినట్లు తేలింది. ఇదిలా ఉంటే ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో 37వ నిందితుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. శనివారం కోర్టుకు సెలవులు కావడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రిమాండ్‌ను ఛాలెంజ్‌ చేయనున్న న్యాయవాదులు. రిమాండ్‌ రిజెక్ట్‌తోపాటు బెయిల్‌పిటిషన్‌ దాఖలు చేయనున్న టీడీపీ లీగల్‌ సెల్‌.

క్రమంలోనే మనీలాండరింగ్ జరిగాయన్న ఆరోపణలతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. విచారణలో భాగంగా 2023 మార్చి10న నలుగురిని అరెస్ట్‌ చేశారు. సీమెన్స్‌ భారత విభాగం ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్, సురేష్‌ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్‌లను అధికారులు అరెస్ట్‌ చేశారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

రెవెన్యూ పరిధిలో కొండ పోరంబోకు భూమిని ఆక్రమించి *

గృహసారధులుకు ఉచిత బీమా సౌకర్యం’