తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్, గోరాపుర్-అరకు-సిమిలిగుడ స్టేషన్‌ల పరిధిలో చేపట్టిన భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజర్ స్పెషల్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డిఏవిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. ఆదివారం విశాఖలో బయల్దేరాల్సిన విశాఖ-కిరండూల్ (08551) పాసింజర్ స్పెషల్ రద్దు చేశారు. తిరుగు ప్రయాణంలో కిరండూల్‌లో 11న బయల్దేరవలసిన కిరండూల్-విశాఖ (08552) పాసింజర్ స్పెషల్ రద్దు చేశామన్నారు.
[zombify_post]