in , , , ,

ఆకస్మాత్తుగా చనిపోయిన యువకుడు.. నెల రోజుల తర్వాత సమాధి తవ్విన వైనం.. షాకింగ్ ఘటన

  • ఓ యువకుడు ఇంటి వద్దే పడి ప్రాణాలు కోల్పోయాడు. అతనికి అంత్యక్రియలకు కూడా చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.

కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం..! నెల రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లారు కుటుంబ సభ్యులు. ఆ కుటుంబం ఆవేదనతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజుల తర్వాత పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు.

ఇదిగో ఈ ప్రాంతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం. వెదురువాడ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న ఈ పేద కుటుంబానికి ఏ యువకుడే పెద్ద దిక్కు. పేరు ఈశ్వరరావు. వయసు 27 ఏళ్లు. ఇంట్లో ఉన్న సోదరి, తల్లికి తనే పోషిస్తూ ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ గత నెల మూడో తేదీన ఇంటి మెట్ల పైనుంచి పడినట్టు చెవి నుంచి రక్తం కారుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈశ్వరరావు. ఒక గంట ఒక కొడుకు ఇలా ప్రాణాలకు కోల్పోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. సహజ మరణం అని అంతా భావించి.. కన్నీటి వీడ్కోలు పలికారు. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

మృతి తరువాత పుకార్లు..

ఈశ్వరరావు మరణం తర్వాత.. గ్రామంలో వేర్వేరు రకాలుగా పుకార్లు వినిపించాయి. అది కాస్త కుటుంబం వరకు చేరింది. దీంతో మృతుడి చెల్లి నాగరత్నానికి అనుమానం వచ్చింది. తల్లితో పాటు వెళ్లి పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. ఈశ్వర రావుది సహజ మరణం కాదని.. తమకు అనుమానాలు ఉన్నాయని.. న్యాయం చేయాలని వేడుకంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు ఎస్సై. మురళీకృష్ణ కేసు పై విచారణ చేయాలని ఆదేశించడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు ప్రారంభించారు. తమకు న్యాయం చేయాలని కోరుతుంది తల్లి విజయ, మృతుడి సోదరి నాగారత్నం.

నెల రోజుల తర్వాత పోస్టుమార్టం..

రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టుమార్టం నిర్వహించారని నిర్ణయించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అనకాపల్లి వైద్య బృందానికి సమాచారం ఇచ్చారు. అచ్చుతాపురం తాసిల్దార్ సమక్షంలో.. ఈశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీశారు. మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈశ్వర రావు ఓ మహిళతో చనువుగా ఉంటున్నాడని.. ఆ కారణంతోనే మరణం సంభవించి ఉంటుందని కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by RAJESH POTLA

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

బలంగా ఢీకొట్టడంతో గాయాలు పాలయ్యాడు.”

రేపు కిరండూల్‌ పాసింజర్‌ రద్దు