అరకు మండలం మడగాడ గ్రామానికి చెందిన ఎం నాని బాబు (30) అనే వ్యక్తి స్థానిక శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనివాస కాలనీకి వెళ్తున్న నేపథ్యంలో కొత్తవలస నుండి ఎస్. కోట వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు ఆయనను బలంగా ఢీకొట్టడంతో గాయాలు పాలయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు.
[zombify_post]