in ,

మోదమ్మను దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్

పాడేరు, అల్లూరి జిల్లా: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, మన్య ప్రజల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మ వారికి శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ దర్శించుకున్నారు. అల్లూరి, మన్యం పార్వతీపురం జిల్లా అధికారులలో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు పాడేరు చేరుకున్న ఆయన పట్టణంలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మోదకొండమ్మ ఆలయ కమిటీ సభ్యులు సింహాచలం నాయుడు, రామారావు రత్నం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్, ఐటీడీఏ పీవో అభిషేక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

అల్లూరి జిల్లా లో విషాదం: పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయుడు మృతి

బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన యాళ్ల దొరబాబు