కోడూరు మండల స్థాయి స్కూల్ గేమ్స్ ను స్వతంత్రం జిల్లా పరిషత్ పాఠశాల నందు కోడూరు మండల జడ్పిటిసి సభ్యులు యాదవ రెడ్డి వెంకట సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గురువారం, శుక్రవారం రెండు రోజులు పాటు ఈ గేమ్స్ సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి టివిఎం రామదాసు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శారీరక మానసిక వికాసానికి ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ -2 వి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు ఆలా వెంకటరమణ, మండల స్పోర్ట్స్ కన్వీనర్ ఎంఎస్ పెరుమాళ్ళు, పీడీ బిపిఎల్ ప్రసాద్, ఆర్ రామ్మోహనరావు, ఎంపీటీసీ తిమ్మన నాంచారయ్య, విశ్రాంతి ఉపాధ్యాయులు ఆలా రమేష్ పాల్గొన్నారు.
[zombify_post]