శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో సుందర సత్సంగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. దీన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. శిబిరంలో 176 మంది రక్తదానం చేశారని సుందర సత్సంగం జిల్లా శాఖ అధ్యక్షుడు సూరిబాబు శ్రీపెరంబుదూరు తెలిపారు. ప్రముఖ వైద్యులు డా. దానేటి శ్రీధర్, సుందర సత్సంగం ప్రతినిధులు అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]