మందస మండలం కొంకడాపుట్టి సచివాలయ పరిధిలో గల బోగాబంద, బసవసాయి, కొంకడాపుట్టి పంచాయతీలకు సంబంధించి నూతనంగా మంజూరైన 19 మంది అర్హులకు గురువారం క్లస్టర్ ఇంచార్జ్ నాగేశ్వర బృందావన్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయడమే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగపరచు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ పద్మ, నాగేశ్వరరావు, మరియు సర్పంచులు రౌతు జయలక్ష్మి ,మజ్జి కుమార్ చంద్ర , సవర బాబురావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]