సత్యనారాయణస్వామి ఆలయంలో 10న వ్రతాలు నెల్లిమర్ల మండలం కొత్తపేటలో చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 10న దంపతులతో వ్రతాలు నిర్వహించనున్నట్లు అర్చకస్వాములు గురువారం వెల్లడించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక వ్రతాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగా సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని .ఆలయ కమిటీ మెంబర్స్ సూచించారు.
[zombify_post]