ఊట్కూర్ : రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలు గురువారం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అయన పేర్కొన్నారు. అంతకుముందు కొల్లూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రమేష్ కుమార్, ఎస్సై గోకరి, సర్పంచులు సూర్యప్రకాశ్ రెడ్డి, సరోజ, కథలప్ప, మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, అధికారులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు బారాస మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]