అరుకు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: పాఠశాల భవనం లేక కటిక నెలలో చదువులు కొనసాగిస్తున్నామని, భవనం ఏర్పాటు చేయండి ప్రభువో అంటూ విద్యార్థులు పాఠశాల షెడ్డు ముందు వినూత్న రీతిలో చేతులు జోడించి ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. పాఠశాల భవనం లేక చిన్నపాటి రేకుల షెడ్డులో చదువులో కొనసాగిస్తున్నామని వర్షాకాలంలో పూర్తిగా కారిపోయి నేలంతా బురదమయంగా తయారవుతుందని, దీంతో తాము ఎలా చదువుకోవాలని విద్యార్థులను ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వేంగడ పంచాయతీ పరిధి డొంకపుటు గ్రామంలో ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు పెన్నంతి, డాలింపుట్టు, మెట్టపాడు, డొంకపుటు గ్రామాలకు చెందిన విద్యార్థులు 76 మంది చిన్న పాటి రేకు షెడ్డులో చదువులు కొనసాగిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ పాఠశాల భవనం కల్పించిన పరిస్థితి నేటికీ లేదు. ఆ షెడ్డులో కనీసం 10. మంది విద్యార్థులు కూర్చొని చదువుకోవాలన్నా అవస్థలు తప్పవు. వర్షాకాలంలో పైకప్పు నుండి వర్షపు నీరు కారడంతో విద్యార్థులు అవస్థలు పడడుతున్నారు.ప్రభుత్వం నాడు నేడు పథకం కింద పాఠశాలను అంగర వైభవంగా తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పడమే తప్పవిద్యార్థులకు కనీస పాఠశాల భవనాలు కల్పించిన దాఖలాలు లేవు. ఏజెన్సీ ప్రాంతంలో అనేక గ్రామాల్లో భవనాలు లేని స్కూళ్లు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా డొంకపుట్టు గ్రామంలో తక్షణమే పాఠశాల భవనం ఏర్పాటు చేసి విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
[zombify_post]