నెలకు సరిపడా నిత్యావసరాలు, బియ్యం పుస్తకాలు వితరణ
భర్త ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అసలే పేద కుటుంబం, పైగా భర్త చనిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యత ఆమె పై పడింది. కట్టుకున్న భర్త వియోగం ఒకవైపు ఇద్దరు పిల్లల కుటుంబ బాధ్యత మరొకవైపు. ఇవన్నీ భరిస్తూనే ఆమె ముందుకు సాగింది. ఇళ్లలో పాచి పనులు చేసుకుంటే కానీ రోజు గడవని పరిస్థితి. అనారోగ్యం ఆమెను కుంగ తీసింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఇల్లు గడవటమే కష్టం గా మారింది ఈ క్రమంలో ఆమె పరిస్థితి తెలుసుకున్న సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, సనాతన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కొనకళ్ళ సుధారాణి ఆమెకు అండగా నిలిచారు. సత్తుపల్లి మండలం గుడిపాడులో చిలకమ్మ అనే మహిళ ఇంటికి వెళ్ళి ఒక నెలకు సరిపడా నిత్యావసరాలు, 25 కిలోల బియ్యం, ఆమె కుమారుడికి పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, అప్పుడే మనిషి జన్మకు పరిపూర్ణత లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ట్రస్ట్ తరపున ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
[zombify_post]