గుణానుపురంలో ఏనుగులు గుంపు సంచారం
కొమరాడ మండలం గుణానపురం గ్రామ సమీపంలో 8 ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు పంట పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచిస్తున్నారు. ఎవరు ఏనుగుల వద్దకి వెళ్లవద్దని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అన్నారు. ఒంటరి ఏనుగుతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
[zombify_post]