ఎస్. కోటలో ఆటో కార్మికుల రాస్తారోకో
ఎస్కోట పట్టణంలో ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ముత్యాలు ఆధ్వర్యంలో బుధవారం ఆటో కార్మికులు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో కార్మికులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని, పోలీసులు వేధింపులు ఆపాలని, మోటార్ చట్టం 2020 రద్దు చేయాలని, ఈ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆటో యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు
[zombify_post]