వర్షాకాలంలో పశువులకు వచ్చే లంపి స్కిన్ వైరస్ (బొబ్బరు వ్యాధి) నివారణకు పశువైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నారు. కురుపాం మండలంలోని కారివలస, మొరంగూడ, పి. ఆమిటి గ్రామాల్లోని పశువులకు పశుసంవర్ధక శాఖ సహాయకులు కె. మణికంఠేశ్వరి బుధవారం టీకాలు వేశారు. పాడిరైతులు తమ వద్ద ఉన్న పశువులకు లంపి వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలని సూచించారు.
[zombify_post]