in , ,

ఆలయాల అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం ……. మంత్రి అల్లోల

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటిటా సంక్షేమా పతకాలతో పాటు గ్రామాలు అభివృద్ధి జరిగాయని న్యాయ పర్యావరణ అటవీ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం. మండలంలోని సోనాపూర్ అనుబంధ గ్రామమైన గోపాల్ పెట్ తండాలో జగదాంబ దేవి విగ్రహ ప్రతిష్టపనకు హాజరై పూజలు చేసి.  మాట్లాడారు ఆలయ నిర్మాణానికి రూ 10 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సీయం కేసీఆర్   అన్ని వర్గాల ప్రజలను సంక్షేమ  పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు  అన్ని  రంగాల్లో  దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని.అన్నారు  ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోపలు రకాల  సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.అన్నారు అన్ని గ్రామాలలో ఆలయాలను అభివృద్ధి చేయడం.జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజల ను దృష్టిలో ఉంచుకొని  సంక్షేమ  పథకాలకు శ్రీకారం చుట్టడంతో ధనిక రాష్ట్రంగా మారిందన్నారు. ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులతో గ్రామాలు  అభివృద్ధి చెందడంతో పచ్చదనం పరిశుభ్రతగా కనిపిస్తున్నాయని అన్నారు. దీంతో పాటు ప్రతి తండాకు బిటి రోడ్ల ను నిర్మించడాని నిధులు మంజూరయ్యని నిర్మాణ పనులను వెంటనే చేపట్టనున్నట్లు తెలిపారు కార్యక్రమములో జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ వెంకట్ రాంరెడ్డి మంత్రి అల్లోల సోదరుడు అల్లోల మురళీధర్ రెడ్డి ఎంపిపి అట్లా మైపాల్ రెడ్డి సొసైటీ చేర్మెన్ మానిక్ రెడ్డి ఆడిల్లి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చందు సర్పంచ్ రామారావు ఎంపిటి శ్రీనివాస్ పార్టీ మండలాధ్యక్షు లు మాధవ్ రావు నాయకులు రాజ్ మహ్మద్ శ్రీనివాస్ రెడ్డి రాంరెడ్డి గంగ రెడ్డి లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపిటిసిలు నాయకులు ఉన్నరు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by VinodKumar

తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ..

పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పై తప్పుడు ప్రచారం