*భారీ వర్షాలతో నీట మునిగిన వంతెనలు*
-బోయినిపల్లి మండల కేంద్రానికి రాక పొకలకు ఇబ్బందులు.
-కల్వర్టుల వద్ద పిచ్చి మొక్కలను తొలగించిన యువ మిత్ర సభ్యులు.
గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి. బోయినిపల్లి నుండి వేములవాడ వెళ్లే దారిలో గల గంజి వాగు, బోయినిపల్లి నుండి కొదురుపాక వెళ్లే దారిలో గల కల్వర్టు లు నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. మోడల్ స్కూలు, కస్తూర్బా పాఠశాలలపై వెళ్లే ఉద్యోగులకు, విద్యార్థులకు,బ్యాంకు పనుల నిమిత్తం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని ప్రజలు అధికారులను, ప్రజాప్రతినిధుల ను కోరుతున్నారు.బోయినిపల్లి నుండి కొదురుపాక వెళ్లే కల్వర్టు ప్రమాద స్థాయిలో ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు .కాగ బోయినపల్లి కొదురుపాక రహదారి పై ఉన్న కల్వర్టు నీట మునుగగా వరద నీరు వెళ్ళడానికి పిచ్చి మొక్కలు అడ్డు గా ఉండటం తో పోలీస్ సిబ్బంది తో కలిసి యువ మిత్ర సభ్యులు పిచ్చి మొక్కలను తొలగించారు.
[zombify_post]