శిరివెళ్ల : అజ్ఞానాంధకారం అనే చీకట్లను పారద్రోలి తాను తన జీవితాన్నిnకొవ్వొత్తిలా కరిగిస్తూ జ్ఞానం అనే వెలుగులను పసి హృదయాల్లో నింపుతూ తడియారిన ఎడారి గుండెల్లో మెదడు అనే కాలువ పొరల్లో అక్షరాలు అనే సరికొత్త విజ్ఞానం వైపు విద్యార్థులను పయనింప జేస్తూన్న ఇద్దరు ఉపాధ్యాయులను తెలుగుదేశం పార్టీ యువ నేత ఉల్లి వెంకటసుబ్బయ్య ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఘనంగా సన్మానించారు.విద్యార్థుల బంగరు భవితకు ఉపాధ్యాయులు పునాదులు వేసి పునాదులతోనే నవ సమాజ నిర్మాణం గావిస్తున్నరని ఉల్లి వెంకటసుబ్బయ్య ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రసంగించారు. డిఎస్ నూరుల్లా, కే.అహ్మద్ హుస్సేన్ అని ఉపాధ్యాయులు నవశకాన్ని సృష్టించే భావి భారత నిర్మాత లోకం పోకడను తన నేత్రాలతో చూయించి నేటి లోకం తీరు అని విద్యార్థులకు జ్ఞాన మార్గాన్ని నిర్దేశించి మమతానురాగాలను పిల్లల మదిలో నింపుతూ సంస్కార వంతులుగా తీర్చిదిద్దే ఓ అభినవ సమాజ నిర్మాతలు గా ఉపాధ్యాయులను అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో చవిడి రమేష్, అత్తర్ జాకీర్ భాష, ఉల్లి రామకృష్ణ, చాకలి మద్దిలేటి, చాకలి శేషు, మంగలి రామసుబ్బయ్య, పడమటింతి నరసింహులు పాల్గొన్నారు.
[zombify_post]