వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మల్ లో రైల్వే లైన్ నిర్మాణం……బీజేపి నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వం వందశాతం నిధులతో నిర్మల్ లో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనుందని బీజేపి నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం బీజేపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.
కేంద్రం లోని మోడీ సర్కార్ తెలంగాణ లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా ఆర్మూర్, హైదరాబాద్ పఠాన్ చెరువు వరకు రైల్వే లైన్ మంజూరు చేస్తూ నిధులు విడుదల చేశారు.

స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి సిగ్గు లేకుండా ఎన్నో సంవత్సరాల నుండి డబ్బా ఛానెల్ లో డబ్బా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వం వారి కోటాను ఇవ్వక పోగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తో ఇప్పటి వరకు తెలంగాణ లో 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఆగిపోయింది.
రైల్వే లైన్ రాకుంటే కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేసే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిగ్గు లేకుండా రైల్వే లైన్ వారి కృషితో వచ్చిందని గాప్పాలు కొట్టుకోవడం విడ్డూరం గా ఉందని ఏడ్దేవా చేశారు.
అలాగే దళిత బందును ఎన్నికల స్టంట్ లో బాగంగా హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ లో ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రతీ దళిత కుటుంబానికి, ప్రతీ బీసీ కుటుంబానికి, ప్రతీ గిరిజన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో నిర్మల్ నియోజక వర్గంలో దళిత బంధు రాని వెలాదిగా దళిత కుటుంబాలతో వచ్చే మంగళవారం 48 గంటల నిరాహార దీక్ష చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు.
ప్రతీ దళిత కుట్టుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన అనంతరం…బీసీ బంధు, గిరిజన బంధు పై కూడా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
వచ్చే నెల నరేంద్ర మోడీ గారు నిర్మల్ కు వస్తున్న సందర్బంగా నిర్మల్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నరేంద్ర మోడీ గారికి నిర్మల్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని మహేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, సామ రాజేశ్వర్ రెడ్డి, సాదం అరవింద్, అయ్యన్న గారి రాజేందర్, శ్రీ గాదె విలాస్, ముత్యం రెడ్డి, అలివేలు మంగ, కమల్ నయన్, వొడిసెల అర్జున్, నరేష్, అల్లం భాస్కర్, జమాల్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]