*నిర్మల్ లో నమోదైన దొంగ ఓట్ల పై ఢిల్లీ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.*
నిర్మల్ ఓటర్ జాబితాలో నమోదైన దొంగ ఓట్ల పై ఢిల్లీ లోని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు నేడు నిర్మల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు, అనంతరం బీజేపీ జాతీయ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అప్రజాస్వామికంగా బోగస్ ఓట్లను నమోదు చేయించి వాటితోనే ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని అన్నారు, కేవలం నిర్మల్ పట్టణం లోనే 32000 లకు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని, దీని వెనుక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హస్తం ఉందని తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తిరిగి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వెలాదిగా దొంగ ఓట్లను నమోదు చేయించి వాటితోనే గెలవాలని చూస్తున్నారని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోలేక మంత్రి ఇంద్రకరణ్ ఇలా దొంగ ఓట్లను నమోదు చేయించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి తగిన గుణపాఠం చెబుతారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు .దొంగ ఓట్ల జాబితా నమోదుపై కమిషన్ వేయాలని, ఇందుకు కారకులైన అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల అధికారి కి తెలిపారు. సానుకూలంగా స్పందించిన అధికారులు దీనిపై ఒక కమిటీ వేసి ఈ దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారుల పై చర్యలు తీసుకొని, ఇందుకు కారకులైన ప్రజా ప్రతినిధులు రానున్న ఎన్నికల్లో వేటు వేసే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు మహేశ్వర్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఏడెల్లి అజయ్ కుమార్, కేతినేని సరళ, కొల్లూరు పవన్ కుమార్, భారద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
