భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండల వరద బాధిత కుటుంబాలకు 5 సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వరద బాధితుల సంఘం ఆధ్వర్యంలో ముట్టడించారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ వరదబాధితుల పోరాటాన్ని విచ్చిన్నం చెయ్యాలని ప్రయత్నిస్తున్న చర్ల పోలీసుల కుటిల వైఖరి మానుకోవాలని అన్నారు.వరదబాధితుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో జరిగే పరిణామాలకు మీరే భాద్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.ఇంటి జాగాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాలని బాధితులకు పిలుపునిచ్చారు
ప్రజాపంథా పార్టీ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ సాధ్యాసాధ్యాలు పరిశీలించి గ్రామాలలో సర్వే జరిపి ప్రభుత్వ ఆదేశాలమేరకు అర్హులైన వారికి తప్పకుండ న్యాయం చేయాలని కోరారు..*
జిల్లా కలెక్టర్ హామీతో వరద బాధితులు ఆందోళన విరమించారు.
[zombify_post]