భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. జిల్లాలోనీ ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని, జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
[zombify_post]