వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ ఇంకా ఎవ్వరికి కన్ఫర్మ్ కాలేదు. సర్వేల ద్వారానే అభ్యర్థి లను నిర్ణయిస్తామని హై కమాండ్ స్పష్టం
అధిష్టానం ఆశీస్సులు ఎవరికి?
పశ్చిమ కాంగ్రెస్‌లో రోజురోజుకు అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి,మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య పోరు తీవ్రమవుతున్నది

ఆరునూరైనా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా :జంగారాఘవ రెడ్డి
టికెట్ నాదే గెలిచేది నేనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ లో టికెట్ల కోసం రోజు రోజుకు కుమ్ములాట జరుగుతూనే ఉంది ఓవైపు నాయిని రాజేందర్ రెడ్డి వర్గం టికెట్ నాయిని కే కేటాయించారని ప్రచారం చేస్తుంటే మరోవైపు మాత్రం అన్ని సర్వేలు మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అధిష్టానం కూడా జంగా వైపే మొగ్గు చూపుతుందని జంగా రాఘవరెడ్డి వర్గీయులు వారికి కావలసిన వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటున్నారని వినికిడి.14 మంది ఎలక్షన్ కమిటీ లో దాదాపు 13 మంది జంగాకే అనుకూలంగా ఉన్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఒక్కడే నాయిని రాజేందర్ రెడ్డి కి అనుకూలంగా ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. దీంతో జంగా అనుచరులు ఉత్సాహంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
దీంతో టికెట్ ఎవరికి వస్తుందో అన్న ఉత్కంఠలో అటు నాయిని వర్గీయులు ఇటు జంగా వర్గీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
[zombify_post]