in , , ,

చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు*

*చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు*

*- విజయనగరం వన్ ఇన్స్పెక్టర్ డా.బివెంకటరావు*

విజయనగరం పట్టణం ప్రదీప్ నగర్ లో అక్టోబరు 10న ఒక మహిళ మెడలో మంగళ సూత్రం త్రెంపుకొని పోయిన

కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లుగా విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో అక్టోబరు 14న నిర్వహించిన

మీడియా సమావేశంలో ఇన్స్పెక్టరు బి. వెంకటరావు వివరాలను వెల్లడించారు

విజయనగరం పట్టణం ప్రదీప్ నగర్ లోని శారద అపార్టుమెంటులో వాచ్ వుమన్ గా పని చేస్తున్న ఉడిగల గౌరి

(45 సం.లు) అనే మహిళ అక్టోబరు 10న, సాయంత్రం 3-45 గంటల సమయంలో ఇస్త్రీ చేసిన బట్టలను దగ్గరలో ఉన్న

ఇంటికి వెళ్ళి ఇచ్చేందుకుగాను వెళ్ళుతుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలుపై వచ్చి, మెడలో ఉన్న రెండు

తులాల బంగారు పుస్తుల త్రాడును త్రెంపుకొని, మోటారు సైకిలుపై పరారైనట్లుగా విజయనగరం 1వ పట్టణ పోలీసు

స్టేషనులో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ పోలీసులు ఫిర్యాదిని విచారణ చేసి, కొన్ని ఆధారాలను సేకరించారు. 1వ పట్టణ పోలీసు

లకు రాబడిన సమాచారంపై విజయనగరం పట్టణం గూడ్సు షెడ్ వద్ద అక్టోబరు 13న వన్ టౌన్ ఎస్ఐ వి.అశోక్ కుమార్

మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి, ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలుపై వస్తుండగా అదుపులోకి తీసుకొని, విచారణ

చేసారు. విచారణలోనిందితులు (ఎ-1) భీమిలి మండలం వలదపేట గ్రామానికి చెందిన కోనాడ రాంబాబు (28 సం.లు)

(ఎ-2) విజయనగరం పట్టణం కమ్మవీధికి చెందిన బేతా లల్లూ (19 సం.లు) అనే ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి చైన్

స్నాచింగుకు పాల్పడిన రెండు తులాల పుస్తుల త్రాడు, 4 కిలోల గంజాయి, ఒక మోటారు సైకిలును, ఒక హెల్మెట్ ను రికవరీ

చేసి, ఎందు కేసుల్లో రిమాండుకు తరలించినట్లుగా వన్ టౌన్ ఇన్స్పెక్టరు బి. వెంకటరావు తెలిపారు. నిందితులకు గంజాయిని సేవించే

అలవాటు ఉన్నట్లు, గంజాయిని తరలించే క్రమంలో పట్టుబడినట్లుగా విచారణలో అంగీకరించారని సిఐ బి. వెంకటరావు

అన్నారు. ఈ కేసును చేధించుటలో వన్ టౌన్ ఎస్ఐ వి. అశోక్ కుమార్, హెచ్.సి. ఎం. అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాస్,

బి. శివ, బి. శంకరరావు, ఎన్.గౌరీ శంకర్ క్రియాశీలకంగా పని చేసారని, వారిని అభినందించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

క్రైస్తవుల సమస్యలను పరిష్కరిస్తాం : హోంమంత్రి తానేటి వనిత

వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ లో చేరికలు