సచివాలయం కార్యాలయం ఆవరణలో ఓ గంజాయి మొక్క ఏపుగా ఎదిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం సచివాలయం -2 కార్యాలయం ఆవరణలో ఈ గంజాయి మొక్క కనిపిస్తుంది. చూడటానికి బంతి మొక్క ను పోలి ఉండటంతో సిబ్బంది దీనికి నీళ్ళు పోసి మిగిలిన మొక్కలతో పాటు పెంచుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్క పూత దశకు చేరుకుంది. దీంతో స్థానికులు ఇది గంజాయి మొక్క గా గుర్తించారు. దీంతో అధికారులు ఈ మొక్క ను ఏం చేయాలా అనే సందిగ్ధంలో పడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ మొక్క పెరుగుతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!